![]() |
![]() |

కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సీజన్ 2 శ్రీముఖి హోస్టింగ్ తో కమెడియన్స్ కెవ్వుకేక పెట్టిస్తున్న కామెడీ స్కిట్స్ తో, మద్యమద్యలో అనిల్ రావిపూడి క్రిస్పీ పంచెస్ తో షో ఆద్యంతం ఆడియన్స్ లో మంచి జోష్ తెప్పిస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కి ఆల్ టైం ఫన్నీ ఎమోజి బ్రహ్మాజీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ని చూసేసరికి అనిల్ రావిపూడి షాకై "షోకి గెస్ట్ ని పిలిచేటప్పుడు గెస్ట్ ఎవరో చెప్పాలి కదా" అనేసరికి శ్రీముఖి షాకయ్యి "ఏమయ్యింది" అని అడిగింది. "బ్రహ్మాజీ గారు ఆ జాకెట్, ఆ గ్లాసెస్, ఒక యూత్ బాయ్ లా ఏజ్ ని కవర్ చేసుకుని వస్తారని ముందే తెలిస్తే మేము కూడా ఏదో ఒక కేర్ తీసుకుంటాం కదా" అనేసరికి బ్రహ్మాజీ నవ్వుకుంటూ "ఏజ్ ని కవర్ చేయాల్సిన అవసరం నాకేంటి" అన్నారు కామెడీగా.
"తప్పే నేను చెప్పింది. ఐతే బ్రహ్మాజీ గారు వస్తున్నారని తెలిసి నేను నా కాళ్ళ దగ్గర డ్రెస్ కొంచెం కట్ చేసుకుని వచ్చాను" అని తన కాళ్ళను చూపించేసరికి బ్రహ్మాజీ కూడా శ్రీముఖి కాళ్ళను చూస్తూ ఉండిపోయాడు. తర్వాత జ్ఞానేశ్వర్ - లేడీ కమెడియన్ రోహిణి కలిసి పార్టీ స్కిట్ కేవలం బ్రహ్మాజీ కోసం వేసేసరికి తాగిన మైకంలో నిజాలు బయటకు చెప్పేసింది రోహిణి " మా ఆయనలో ఏమీ లేదు అంతా డొల్ల" అనేసరికి శ్రీముఖి తాగకుండానే నిజాలు చెప్పేసింది "మా ఆయనేమీ డొల్ల కాదు మా ఆయన ఎవరో తెలుసా...బ్రహ్మాజీ" అని చెప్పేసరికి ఆయన తెగ సిగ్గుపడిపోయాడు. "గర్ల్స్ పార్టీ చూద్దామనుకున్న కానీ ఆంటీ పార్టీ చూడాల్సి వచ్చింది" అని బ్రహ్మాజీ రోహిణి స్కిట్ మీద కామెంట్ చేసారు. తర్వాత ఎక్స్ప్రెస్ హరి వచ్చి బ్రహ్మాజీకి కొత్త ఇంట్రడక్షన్ ఇచ్చాడు. "2 జి, 3 జి, 4 జి ఎన్ని జీలు మారినా తగ్గదు ఆయనలోని ఎనెర్జీ ఆయనే బ్రహ్మాజీ" అనేసరికి బ్రహ్మాజీ కళ్ళలో వెలుగులొచ్చాయి.
![]() |
![]() |